Elections: బిహార్ ఎన్నికలకు ఈసీ రెడీ.. 470 మంది అబ్జర్వర్ల నియామకం

by B.Srinivas |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. 470 మంది అబర్జర్వర్లను నియమించింది.

Elections: బిహార్ ఎన్నికలకు ఈసీ రెడీ.. 470 మంది అబ్జర్వర్ల నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. బిహార్ ఎలక్షన్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ బైపోల్స్‌కు 470 మంది అబర్జర్వర్లను నియమించింది. వీరిలో 320 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, 60 మంది ఐపీఎస్ అధికారులు, 90 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్, ఐసీఏఎస్ అధికారులు సైతం ఉన్నారు. ఈ అధికారులందరినీ బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశాలో జరగనున్న ఉప ఎన్నికలకు నియమిస్తున్నట్టు ఈసీ తెలిపింది. ఈ పరిశీలకులతో వచ్చే నెల 3వ తేదీన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. బిహార్‌తో ఎన్నికల సన్నాహాలకు వెళ్లేముందు వారికి పలు సూచనలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా మార్చేందుకే అబ్జర్వర్లను అపాయింట్ చేసినట్టు ఈసీ తెలిపింది. పరిశీలకులు ఎన్నికలు నిర్వహించడంలో ఈసీకి సహాయం చేయడతో పాటు ప్రజల్లో అవగాహన పెంచి, ఎక్కువ మంది ఓటు వేసేలా ప్రోత్సహిస్తారని వెల్లడించింది. కాగా, ఈనెల 30న బిహార్‌లో తుది ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించనున్న విషయం తెలిసిందే.

Next Story