334 పార్టీలు డీలిస్ట్ చేసిన ఈసీ.. తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి ఐదు!

by Phanindra |

దేశవ్యాప్తంగా 334 పార్టీలను ఎన్నికల సంఘం డీలిస్ట్ చేసింది. వీటిలో తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి ఐదు పార్టీలున్నాయి.

334 పార్టీలు డీలిస్ట్ చేసిన ఈసీ.. తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి ఐదు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 334 రిజిస్టర్డ్ అన్‌రికగ్నయిజ్డ్ పొలిటికల్ పార్టీలను డీలిస్ట్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. 2019 నుంచి ఆరేళ్ల పాటు కనీసం ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయాలనే కనీస నియమాన్ని కూడా ఈ పార్టీలు పాటించలేకపోయాయని ఈసీ తెలిపింది. ఈ పార్టీల ఆఫీసులు కూడా తమకు కనిపించలేదని పేర్కొంది.

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఈ పార్టీలను తొలగించారు. వీటిలో తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి 5 పార్టీలున్నాయి. ఇందులో జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణి రుద్రమ స్థాపించిన యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా సహా పలు పార్టీలు ఉన్నాయి. కాగా, గతంలో దేశవ్యాప్తంగా 2854 రిజిస్టర్డ్ పార్టీలుండగా.. 334 పార్టీలను డీలిస్ట్ చేయడంతో ఈ సంఖ్య 2520కు చేరింది.

ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలున్నట్లు ఈసీ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో 345 పార్టీలను డీలిస్ట్ చేసేందుకు అవసరమైన ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. చివరకు 334 పార్టీలను తొలగించింది.

Next Story