- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన ఎన్నికల ప్రచారం.. బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 142 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 142 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. మే 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రెండో విడత పోలింగ్‌లో ఓటర్లందరూ చైతన్యంతో పాల్గొని, తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన ఈ లేఖ ద్వారా కోరారు. ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఈ సువర్ణావకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్ లో ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఓటు ఒక శక్తివంతమైన ఆయుధమని ప్రధాని పేర్కొన్నారు. బెంగాల్ భవిష్యత్తును మార్చడానికి, అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆయన వివరించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌లో రాజకీయ మార్పుపై మోదీ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమాగా వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది పోలింగ్ రూపంలో వ్యక్తమవుతుందని ఆయన తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.






