- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని భాషలూ జాతీయ భాషలే: ధర్మేంద్ర ప్రదాన్
by Phanindra |
అన్ని భాషలూ జాతీయ భాషలేనని ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. పిల్లలకు కొత్త సాహిత్యం నేర్పడం ద్వారానే దేశంలో ఐకమత్యం పెరుగుతుందని చెప్పారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. కశ్మీర్‌లో నిర్వహించిన చీనార్ బుక్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని భాషా వైవిధ్యాన్ని గుర్తుచేశారు. ‘కశ్మీరి, తమిళ్, మలయాళం, అస్సామీస్.. అన్ని భారత భాషలూ జాతీయ భాషలే. కశ్మీర్‌లోని పిల్లలు తమిళ సాహిత్యం చదవాలి, అలాగే తమిళనాడులోని పిల్లలు కశ్మీరీ రచనలు చదవాలి. అలాగే దేశంలో ఐకమత్యం పెరుగుతుంది’ అని ప్రధాన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హిందీ, ఇంగ్లీషులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంచ్ చేసిన ‘జమ్మూకశ్మీర్ అండ్ లడఖ్: త్రూ ది ఏజెస్’ పుస్తకం కశ్మీరీ అనువాదాన్ని ప్రదాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనువాదం అనేది కేవలం భాషాపరమైన ప్రక్రియ కాదని, అది జాతీయ బాధ్యతని అభిప్రాయపడ్డారు.
Next Story






