బొగ్గు కుంభకోణంలో అధికారుల హస్తం.. సమన్లు జారీ చేసిన ఈడీ..

by Dishanational4 |
బొగ్గు కుంభకోణంలో అధికారుల హస్తం.. సమన్లు జారీ చేసిన ఈడీ..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు మారింత దూకుడు పెంచాయి. కాగా, బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఈడీ ముందు హాజరయ్యారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు ఐపీఎస్ అధికారుల హస్తం ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

ఈ మేరకు బుధవారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జ్ఞానవంత్ సింగ్, కోల్‌కతా పోలీస్ సౌత్ డివిజన్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆకాష్ మఘరియాలకు ఈడీ సమన్లు జారీ చేసింది. జ్ఞానవంత్ సింగ్‌ను సెప్టెంబర్ 26న, ఐపీఎస్ ఆకాష్ మఘరియా సెప్టెంబర్ 28న విచారణకు హాజరుకావాల్సిందిగా కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాల నుండి అక్రమ తవ్వకాలు, బొగ్గు రవాణా అమ్మకాలపై సీబీఐ, ఈడీ ముమ్మర దర్యాప్తులు చేస్తోంది.

Next Story