మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు షాక్ ఇచ్చిన ఈడీ.. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులు

by Malleboina Mahesh |   (  Updated:2025-09-16 07:38:04  IST  )

ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు షాక్ ఇచ్చిన ఈడీ.. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: అమాయక యువత ప్రాణాలు తీసుకోవడానికి కారణం అవుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Promotions) కేసుల్లో దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా భారత మాజీ స్టార్ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్‌ (Yuvraj Singh) కు సైతం ఈ డీ నోటీసులు ఇచ్చింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ప్రశ్నించేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న హాజరుకావాలని ఈడీ నోటీసులు (ED Notices) జారీ చేసింది. ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లో పలువురు ప్రముఖులు పాత్ర పోషించారని అనుమానాలపై విచారణ కొనసాగుతోంది.

ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా విచారణకు పిలుపు అందుకున్నారు. 1xBet లాంటి అనుమానాస్పద ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల (Online betting platforms)కు ప్రకటనలు, ప్రమోషన్ల ద్వారా సహకారం అందించిన వారిపై ఈడీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎంత మొత్తం నిధులు లావాదేవీ అయ్యాయి, వాటి ద్వారా ఎంత లాభం పొందారనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. యువరాజ్ సింగ్ సహా ఇతరులపై విచారణ ఫలితాలు బయటపడితే కేసు దిశలో మరిన్ని వివరాలు స్పష్టమవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Next Story