ఎన్నికల సేవల్లో విప్లవం: అధికారికంగా అందుబాటులోకి రానున్న ఈసీఐనెట్ ప్లాట్‌ఫారమ్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-03 13:39:34  IST  )

భారత దేశ ఎన్నికలకు సంబంధించి.. ఒకే యాప్‌లో 40 రకాల సేవలు అందించేందకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల సేవల్లో విప్లవం: అధికారికంగా అందుబాటులోకి రానున్న ఈసీఐనెట్ ప్లాట్‌ఫారమ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ ఎన్నికలకు సంబంధించి.. ఒకే యాప్‌లో 40 రకాల సేవలు అందించేందకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. జనవరి 10 వరకు సూచనల గడువు ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు 'ఈసీఐనెట్' యాప్‌ రూపొందించారు. కాగా దీనిని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు భారత ఎన్నికల సంఘం పౌరుల నుంచి సూచనలను ఆహ్వానించింది. శనివారం (జనవరి 3, 2026) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని 'సబ్మిట్ ఏ సజెషన్' (Submit a Suggestion) ట్యాబ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఈ సూచనలు ఇచ్చేందుకు జనవరి 10, 2026 వరకు గడువు విధించింది. వచ్చిన సూచనలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత ఈ నెలాఖరులోనే ఈ ప్లాట్‌ఫారమ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఒక్క యాప్.. 40 సేవలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ హెల్ప్‌లైన్, సివిజిల్ (cVIGIL), సక్షమ్ వంటి దాదాపు 40కి పైగా విభిన్న యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఏకం చేస్తూ ఈ 'ఈసీఐనెట్'ను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ యాప్.. ఓటింగ్ శాతం గణాంకాలను త్వరగా అందించడంలో, పోలింగ్ ముగిసిన 72 గంటల్లోనే ఇండెక్స్ కార్డులను ప్రచురించడంలో విజయవంతమైందని ఈసీ వెల్లడించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ డిజిటల్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story