- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వాడకంపై ఈసీ ఫోకస్.. కీలక ఆదేశాలు జారీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం (Election Commission) నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections)తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో డబ్బు శక్తి, ఉచిత బహుమతులు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మద్యం వాడకాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అన్ని చట్ట అమలు సంస్థలకు (Enforcement Agencies) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఎన్నికల సమయంలో చేసే వ్యయాలను పర్యవేక్షించేందుకు ఖర్చు పరిశీలకులను (Expenditure Observers) ఇప్పటికే నియమించారు.
కాగా ఇప్పటికే వారంతా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజునే ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం ప్రకారం, వీరు తమ సందర్శనలో ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ బృందాలతో సమావేశమవుతారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సర్వైలెన్స్ బృందాలు, వీడియో పర్యవేక్షణ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ, ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు లేదా ఇతర ప్రలోభాలు వినియోగించే ప్రయత్నాలను కట్టడి చేస్తాయని తెలిపింది. ఇప్పటికే వివిధ సంస్థలు ₹33.97 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులను స్వాధీనం చేసుకున్నాయి అని ఎన్నికల సంఘం వెల్లడించింది.






