- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EC: రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం ఎలాంటి వివక్ష చూపదు
రాజకీయ పార్టీల విషయంలో ఎన్నికల సంఘానికి ఎలాంటి వివక్ష చూపదని, అన్ని పార్టీలు తమకు సమానమేనని ఆయన స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఓటర్ల డేటా మోసం జరిగిందనే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఆదివారం సమాధానమిచ్చారు. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదన్నారు. రాజకీయ పార్టీల విషయంలో ఎన్నికల సంఘానికి ఎలాంటి వివక్ష చూపదని, అన్ని పార్టీలు తమకు సమానమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన సీఈసీ.. ఓట్ చోరీ పేరుతో కొందరు లేనిపోని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఓటర్ల ఫోటోలను వారి అనుమతి లేకుండా మీడియాకు ప్రదర్శించారని, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు మాత్రమే తమ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఓటు వేశారని అన్నారు. ఈసీ భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని జ్ఞానేష్ కుమార్ అన్నారు. కొంతమంది ఓటర్లు డబుల్ ఓటింగ్ చేశారని ఆరోపించారు. రుజువు అడిగినప్పుడు, ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ లేదా ఏ ఓటరు కూడా అలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడరని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో కోటి మందికి పైగా ఉద్యోగులు, 10 లక్షలకు పైగా బూత్ లెవల్ ఏజెంట్లు, అభ్యర్థులకు చెందిన 20 లక్షలకు పైగా పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల కోసం పని చేస్తారు. ఇంత మంది ప్రజల ముందు ఈ స్థాయిలో పారదర్శకంగా జరిగే ప్రక్రియలో, ఏ ఓటరు అయినా ఓట్లను దొంగిలించగలరా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడం సరికాదు. ఓటర్ల జాబితాకు సంబంధించి బూత్ లెవల్‌లోనే అన్ని పార్టీలు చూసుకుంటాయి. సంస్కరణల్లో భాగంగానే ఇటీవల ఓటరు జాబితాను సవరిస్తున్నామని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు.






