Earthquake: కోల్‌కతాలో ప్రకంపనలు.. తీవ్ర భయాందోళనకు గురైన జనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-25 01:42:50  IST  )

వరుస భూకంపాలు (Earthquakes) దేశ ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Earthquake: కోల్‌కతాలో ప్రకంపనలు.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస భూకంపాలు (Earthquakes) దేశ ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 6.10 గంటలకు బంగాళాఖాతం (Bay of Bengal)లో భూకంపం సంభించింది. దీంతో సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని కోల్‌కతా (Kolkata) నగరంలో స్వల్పంగా భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకటించింది. అయితే, భూకంప తీవ్రంత రిక్టర్ స్కేలు (Richter scale)‌పై తీవ్రత 5.1గా నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా కోల్‌కతా (Kolkata) ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆసలు ఏం జరుగుతోందని తెలుసుకునేలోపే అంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. బంగాళాఖాతంలోని సముద్ర గర్భంలో 91 కి.మీ లోతున భూకంపం సంభవించినట్లుగా నేషల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది.

Next Story