- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dowry: దేశ వ్యాప్తంగా 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు... యూపీలోనే అత్యధికం !
దేశవ్యాప్తంగా వరకట్నం కేసులు 14 శాతం పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో వెల్లడైంది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వరకట్నం కేసులు 14 శాతం పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదికలో వెల్లడైంది. 2023లో వరకట్న నిషేధ చట్టం కింద 15,489 కేసులు నమోదు కాగా 2021లో13,568, 2022లో 13,479 కేసులు నమోదైనట్టు ఎన్సీఆర్బీ తెలిపింది. ఈ చట్టం కింద అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో (Utharapradesh) 7,151 కేసులు రికార్డు కాగా ఆ తర్వాత బిహార్ 3,665, కర్ణాటక 2,322 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, సిక్కిం సహా 13 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదు కాలేదు. 2023లో మొత్తం 6,156 మంది వరకట్న వేధింపులతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 2,122 మరణాలతో యూపీ అగ్రస్థానంలో ఉండగా బిహార్ 1,143 మరణాలతో రెండో స్థానంలో ఉంది. 2023లో దేశవ్యాప్తంగా 833 హత్య కేసులకు వరకట్నమే కారణమని తెలిపింది. అలాగే ఈ చట్టం కింద పోలీసులు 27,154 మందిని అరెస్టు చేయగా వీరిలో 22,316 మంది పురుషులు, 4,838 మంది మహిళలు ఉన్నారు.






