- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తాం: ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు.

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి ఇరాన్(Iran)కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. తమ జోలికి వచ్చిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇరాన్ సుప్రీం ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు. ముఖ్యంగా తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన కామెంట్లు చేశారు. "ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాదు. ఖమేనీ, అతని గూండాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది బాధితులకు దక్కిన న్యాయం" అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా వాడిన అత్యాధునిక హైలీ సోఫిస్టికేటెడ్ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని ఆయన వివరించారు.






