- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నారైలకు రిలీఫ్.. రిమిటెన్స్ ట్యాక్స్‌ను 1శాతానికి తగ్గించిన యూఎస్!
ఎన్నారైలకు ట్రంప్ సర్కారు రిలీఫ్ ఇచ్చింది. రిమిటెన్స్ ట్యాక్స్‌ను 1శాతానికి తగ్గించింది.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ నుంచి విదేశాలకు చేసే నగదు బదిలీలపై వేయాలనుకుంటున్న రిమిటెన్స్ ట్యాక్స్‌పై ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 5 శాతం రిమిటెన్స్ ట్యాక్స్ వేయాలని ఆరంభంలో భావించగా.. దీన్ని 1 శాతానికి పరిమితం చేస్తున్నట్లు తాజా ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ డ్రాఫ్ట్‌లో పేర్కొంది. ఇది యూఎస్‌లో ఉండే భారతీయులకు తీపికబురే అని చెప్పాలి. నాన్-యూఎస్ పౌరులు ఇతర దేశాలకు చేసే నగదు బదిలీలపై 5 శాతం రిమిటెన్స్ ట్యాక్స్ వేయాలని అనుకున్న రిపబ్లికన్ ప్రభుత్వం.. ఆ తర్వాత దీన్ని 3.5 శాతానికి తగ్గించింది. ఇక తాజా సవరణలో దీన్ని 1 శాతానికే పరిమితం చేస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన ఖాతాలు, అలాగే యూఎస్ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఫండింగ్ చేస్తున్న అకౌంట్లపై ఈ ట్యాక్స్ ఉండదని కూడా కొత్త బిల్లు పేర్కొంది. గ్రీన్ కార్డు హోల్డర్లు, హెచ్1బీ, హెచ్2ఏ వంటి వీసాలతో యూఎస్‌లో పనిచేస్తున్న వారు.. అందరికీ ఈ ట్యాక్స్ వర్తిస్తుంది.






