- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్.. ట్రంప్ వార్నింగ్‌పై చైనా సీరియస్!
బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్ విధిస్తానంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై చైనా సీరియస్‌గా రియాక్ట్ అయింది.

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సమావేశం జరుగుతున్న సమయంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ దేశాలు తీసుకొస్తున్న ‘అమెరికా వ్యతిరేక’ విధానాలను అమలుచేసే దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో ఏ దేశానికీ మినహాయింపు ఉండదంటూ తన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.
దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇలా సుంకాలతో ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. బ్రిక్స్ గ్రూప్ స్వేచ్ఛను, కలిసి నడవడాన్ని, విన్-విన్ సహకారాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తుందని ఆమె అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకదానితో మరొకటి సహకరించుకొని వేగంగా ఎదగడంపై బ్రిక్స్ ఫోకస్ పెడుతుందని, అంతేకానీ ఏదో ఒక దేశానికి వ్యతిరేకంగా పనిచేయదని ఆమె స్పష్టంచేశారు.






