- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడని మొండి పట్టు.. టారిఫ్‌లపై సుప్రీం కోర్టుకు డొనాల్డ్ ట్రంప్
ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆ విషయంలో మరో బిగ్ స్టెప్ వేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆ విషయంలో మరో బిగ్ స్టెప్ వేశాడు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌లు చాలా వరకు రాజ్యాంగవిరుద్ధమన అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు (US Federal Appeals Court) తీర్పును వెలువరించింది. అత్యవసర ఆర్థిక అధికారాలను తుంగలో తొక్కి వివిధ దేశాలపై యథేచ్ఛగా టారీఫ్‌లు విధించారని 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు తీర్పు చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ ట్రంప్ తాను విధించిన టారిఫ్‌లు చట్టానికి లోబడే ఉన్నాయంటూ తాజాగా సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మరో రెండు రోజుల్లో విచారణ చేపట్టనుంది. అయితే, సుంకాలపై కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతోందని అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
కాగా, భారీగా విధించిన సుంకాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయని ఇటీవల విచారణ సందర్భంగా అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతించారు. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను అమలు చేశారు. అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా టారీఫ్‌లు విధించారు. బేస్‌లైన్‌గా 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇక భారత్‌పై తొలుత 26 శాతం టారిఫ్‌లు విధించగా, రష్యా నుంచి భారత్ చమురును తక్కువకు కొని లబ్ధి పొందుతోందని అనంతరం వాటిని 50 శాతానికి పెంచారు. ఈ నెల 27 నుంచి పెంచిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.






