- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐ లవ్ పాకిస్థాన్: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సమావేశం గురించి వైట్ హౌస్‌లో మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సమావేశం గురించి వైట్ హౌస్‌లో మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకు పాకిస్థాన్ అంటే చాలా ఇష్టం అని యుద్ధాన్ని తానే ఆపానని అన్నారు. ఐ లవ్ పాకిస్థాన్ అని అన్నారు. మోడీ గొప్ప వ్యక్తి అని నిన్న రాత్రే ఆయనతో మాట్లాడానని చెప్పారు.
భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. పాకిస్థాన్ నుండి అసిఫ్ మునీర్‌తో భారత్ నుండి మోడీతో మాట్లాడి యుద్ధాన్ని ఆపానని చెప్పారు. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు అని శక్తివంతమైన దేశాలని చెప్పారు. ఇదిలా ఉంటే గతంలోనూ ట్రంప్ ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇండియా, పాకిస్థాన్ ఖండించాయి. అయినప్పటికీ ట్రంప్ మరోసారి యుద్ధం తానే ఆపానని కామెంట్లు చేయడం ఆశ్చర్యకరం.






