వెనక్కి తగ్గేది లేదు... సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ రియాక్ట్ !

by velandi.Saikiran |

సుప్రీంకోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అన్ని దేశాలపై 10% అదనపు సుంకాలను విధించేందుకు సిద్ధం అవుతున్నార‌ట‌.

వెనక్కి తగ్గేది లేదు... సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ రియాక్ట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అమెరికా సుప్రీంకోర్టు ( US Supreme Court) సంచలన నిర్ణయం తీసుకొని డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) నకు షాక్ ఇచ్చింది. ఆయా దేశాలపై డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లను కొట్టేసింది సుప్రీం కోర్టు. సుంకాలు విధించే అధికారం అసలు అధ్యక్షుడికి లేదని అమెరికా సుప్రీం కోర్టు వెల్లడించింది. అంతేకాదు ఇప్పటి వరకు టారిఫ్ ల‌ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఆయా దేశాలకు తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో బాధిత దేశాలు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

సుప్రీం కోర్టు తీర్పుపై డోనాల్డ్ ట్రంప్ రియాక్షన్

టారిఫ్ లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను విధించిన టారిఫ్ రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీవ్ర నిరాశపరిచిందని మండిపడ్డారు. కొంత మంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితం అయ్యారని కూడా సంచలన ఆరోపణలు చేశారు డోనాల్డ్ ట్రంప్. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గుపడుతున్న అని కూడా హేళన చేశారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని దేశాలపై 10% అదనంగా సుంకాలను విధించేందుకు కూడా డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అన్ని దేశాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

Next Story