- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం: హర్మూజ్ జలసంధి దిగ్బంధానికి ఆదేశం
ఇరాన్ అణు కార్యక్రమాలు, మొండి వైఖరిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ అణు కార్యక్రమాలు, మొండి వైఖరిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో అత్యంత కఠినమైన నిర్ణయాలను ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) వెంటనే దిగ్బంధం చేయాలని యూఎస్ నావికా దళానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌కు టోల్ చెల్లిస్తున్న నౌకలను అడ్డుకోవాలని, తద్వారా ఆ దేశానికి అందుతున్న ఆర్థిక వనరులను పూర్తిగా అణచివేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు బెడిసికొట్టడానికి ఇరాన్ వైఖరే కారణమని ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే మాట తప్పిందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.
అణు హెచ్చరిక..
ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించలేదని ట్రంప్ స్పష్టం చేశారు. "ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లో అణుశక్తి ఉండటాన్ని మేము ఏమాత్రం అంగీకరించం" అని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ అణు సమస్యపై మొండిగా వ్యవహరించడం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. తాజా దిగ్బంధం నిర్ణయంతో ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని, ఇది అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






