ట్యూషన్‌కు వెళ్తున్న బాలుడిపై కుక్కల దాడి

by velandi.Saikiran |

ట్యూషన్‌కు వెళ్తున్న బాలుడిపై పెంపుడు, వీధి కుక్కల దాడి చేసిన సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది.

ట్యూషన్‌కు వెళ్తున్న బాలుడిపై కుక్కల దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్: చిన్నారులపై కుక్కల దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ కుక్కల దాడులు మాత్రం ఆగడం లేదు. దేశంలోని ఏదో ఒక మూలన కుక్కల బీభత్సం తెరపైకి వస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా ట్యూషన్ కు వెళ్తున్న ఓ బాలుడిపై పెంపుడు కుక్కతో పాటు వీధి కుక్క దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ ఇజ్జత్ నగర్ లో బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ట్యూషన్ కు వెళ్తున్న ఓ బుడ్డోడి పై పెంపుడు, వీధి కుక్క కలిసి ఘోరంగా దాడి చేశాయి. అదే సమయంలో పెంపుడు కుక్కను వాకింగ్ కు తీసుకువెళ్లిన ఓ టీచర్ తల్లి... దాడిని ఆపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఉపాధ్యాయుడితో పాటు ఆమె తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. క్లిక్


Next Story