మంత్రుల పిల్లలకు టిక్కెట్లు ఇవ్వడాన్ని సమర్థించిన డీకే శివకుమార్

by Disha Web Desk 17 |
మంత్రుల పిల్లలకు టిక్కెట్లు ఇవ్వడాన్ని సమర్థించిన డీకే శివకుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఐదు మంది మంత్రుల వారసులకు టిక్కెట్లు కేటాయించగా, బంధుప్రీతిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఐదుగురు మంత్రుల పిల్లలకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వడాన్ని సమర్థిస్తున్నాను. ప్రస్తుతం దేశంలోని రాజకీయ వ్యవస్థ మారిపోయింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోని నాయకులు, మంత్రులు తమ వారసులను, కుటుంబసభ్యులను ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారని అన్నారు.

మేము కొత్త ముఖాల కోసం చూస్తున్నాము, యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. బలమైన నేపథ్యం ఉన్నవారిని ఎంచుకుంటున్నాం, అలాగే, వారు ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నాం, స్థానిక నాయకులందరూ మంత్రుల పిల్లలకు మద్దతు ఇస్తున్నారు. వారు పార్టీ కోసం పనిచేస్తున్నారని శివకుమార్ చెప్పారు.

ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో 17 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించగా, వారిలో ఐదుగురు మంత్రుల పిల్లలు కూడా ఉన్నారు. వారు, సతీష్ జార్కిహోళి కుమార్తె ప్రియాంక జార్కిహోళి (చిక్కోడి), రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి (బెంగళూరు సౌత్), శివానంద్ పాటిల్ కుమార్తె సంయుక్త ఎస్ పాటిల్ (బాగల్‌కోట్), లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ (బెల్గాం) కుమారుడు ఈశ్వర్ ఖండ్రే (బెల్గాం).


Next Story