- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకమాండ్ ఆదేశించిన వెంటనే డీకే సీఎం అవుతారు: సీఎం సిద్దరామయ్య
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ నివాసంలో అల్పాహారం స్వీకరించిన అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ నివాసంలో అల్పాహారం స్వీకరించిన అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా కర్ణాటక సీఎం పోస్టు (Karnataka CM post)పై నెలకొన్న అయోమయంపై స్పందిస్తూ.. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే.. అప్పుడే డీకే శివకుమార్ సీఎం పదవి చేపడతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. "డీకే శివకుమార్ గతంలో నా ఇంటికి అల్పాహారం కోసం వచ్చారు, అందుకే నేను వారి ఆహ్వానం మేరకు ఈ రోజు అల్పాహారం కోసం వారి ఇంటికి వస్తానని చెప్పాను. మంగళవారం రావాలని ఆయన సూచించారు, అందుకే ఈ రోజు వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేశాం" అని సిద్ధరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా తాము పార్టీకి సంబంధించిన విషయాలను చర్చించామని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాక, రాబోయే పరిపాలన అంశాలు, రైతుల సమస్యలపై కూడా ప్రధానంగా చర్చించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చూస్తున్నాయని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించాలని యోచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "మా ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వం (pro-farmer). మొక్కజొన్న, చెరకు సంబంధిత సమస్యలపై కూడా మేము చర్చించాం. రైతులతో నేను మాట్లాడాను, ప్రభుత్వం ధరను నిర్ణయించింది. నేను కోళ్ల పెంపకందారులు, మత్స్యకారులతో కూడా మాట్లాడాను," అని సీఎం సిద్దరామయ్య మీడియాతో చెప్పుకొచ్చారు.






