రేపటి నుంచి పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ

by Naga Rani Yarlagadda |

సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు పునః ప్రారంభం కానుండగా.. లోక్‌సభ (Lok Sabha)లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)పై చర్చ జరగనుంది.

రేపటి నుంచి పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు పునః ప్రారంభం కానుండగా.. లోక్‌సభ (Lok Sabha)లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)పై చర్చ జరగనుంది. ఈ చర్చ కోసం కేంద్రం 16 గంటల సమయాన్ని కేటాయించింది. ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) సమక్షంలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగనుండగా.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించనున్నారు. మరోవైపు రాజ్యసభలోనూ దీనిపై చర్చ జరగనున్నట్లు కేంద్రం తెలిపింది.

రాజ్యసభ (Rajya Sabha)లో జులై 29వ తేదీ నుంచి 9 గంటల పాటు ఆపరేషన్ సింధూర్‌పై చర్చించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. సీజ్‌ఫైర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కామెంట్స్‌పై ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రేపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్‌పై జరిగే చర్చలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్లోని(Jammu&Kashmir) పహల్గామ్‌ (Pahalgam Terror Attack)లో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మంది పురుషుల్ని హతమార్చారు. భారత మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు ఇండియన్ ఆర్మీ (Indian Army) ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసి పాకిస్థాన్, పీఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది.

Next Story