- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaishankar in Parliament : వలసదారుల బహిష్కరణ కొత్తేమీ కాదు : పార్లమెంటులో జై శంకర్
అమెరికా(USA) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం భారత అక్రమ వలసదారుల(illegal Indian immigrants) ను కాళ్లకు, చేతులకు సంకేళ్లు వేసి తరలించడం పట్ల పార్లమెంటు(Parliament)సమావేశాల్లో ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రకటన చేసింది

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(USA) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం భారత అక్రమ వలసదారుల(illegal Indian immigrants) ను కాళ్లకు, చేతులకు సంకేళ్లు వేసి తరలించడం పట్ల పార్లమెంటు(Parliament)సమావేశాల్లో ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రకటన చేసింది. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ( Jaishankar) అన్నారు. తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని పేర్కొన్నారు.
అమెరికా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న 104 ముంది భారతీయులను స్వదేశానికి పంపడంపట్ల ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు. బహిష్కరణ (deportation) ప్రక్రియ కొత్తేమీ కాదన్నారు..2009 నుంచే ఆ ప్రక్రియ జరుగుతోందన్నారు. బహిష్కరణ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. 'బహిష్కరణ ప్రక్రియ కొత్తేమీ కాదని.. ఇది కొన్ని ఏళ్లుగా కొనసాగుతోందని.. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదని పేర్కొన్నారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని గుర్తు చేశారు.
2012లో ఈ సంఖ్య 530గా ఉండగా... 2019లో 2 వేలకు పైగా ఉందని.. ఇక వలసదారులను ఎయిర్ క్రాఫ్ట్ తరలించే విధానాన్ని 2012 నుంచి అమలు చేస్తున్నారని.. వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడం అమెరికా విధానమని వెల్లడించారు. వలసదారుల తరలింపు ప్రయాణంలో అవసరమైనప్పుడు వాటిని తొలగిస్తారని.. వారికి అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను కూడా సమకూరుస్తారని జైశంకర్ తెలిపారు.






