- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పోలీసుల బిగ్ ఆపరేషన్.. ఆరుగురు ఉగ్రవాద అనుమానితులు అరెస్ట్
తమిళనాడులో నకిలీ గుర్తింపులతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ఇవాళ తమిళనాడు (Tamilnadu)లో అరెస్ట్ చేశారు. నిందితులు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి, నకిలీ ఆధార్ కార్డులతో గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో మిజానుర్ రెహమాన్, మహమ్మద్ షాబత్, ఉమర్, మహమ్మద్ లిటన్, మహమ్మద్ షాహిద్, మహమ్మద్ ఉజ్జల్‌గా గుర్తించారు. ముగ్గురు నిందితులు పల్లడంలో, ఇద్దరు ఉతుకుళిలో, మరో నిందితుడు తిరుమురుగన్‌పూండి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు..
అయితే, నిందితులంతా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నట్లుగా ప్రాథమికంగా తేలింది. ఉగ్రవాదులకు సహకరిస్తూ, దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వీరు రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ‘ఫ్రీ కాశ్మీర్’ (Free Kashmir) పేరిట పోస్టర్లు వేయడంలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులందరినీ రైలులో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ టెర్రర్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.






