- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi court: శిక్షకు బదులుగా అవగాహనకు ప్రాధాన్యతివ్వాలి.. టీనేజ్ ప్రేమపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
టీనేజ్ ప్రేమకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో శిక్షకు బదులుగా అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: టీనేజ్ ప్రేమకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో శిక్షకు బదులుగా అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు (Delhi high court) అభిప్రాయపడింది. ఏకాభిప్రాయంతో కూడిన, బలవంతం లేని సంబంధాలను అంగీరించేలా చట్టం చేయాలని తెలిపింది. మైనర్లు తమ భావోద్వేగాలను వ్యక్తపర్చడానికి నేరపూరితంగా మారుతుందనే భయం లేకుండా సంబంధాలలో పాల్గొనడానికి అనుమతించాలని పేర్కొంది. మైనర్లను రక్షించడానికి చట్టబద్ధమైన సమ్మతి వయస్సు కూడా చాలా కీలకమని నొక్కి చెప్పింది. ఓ పోక్సో కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్మీత్ సింగ్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు లైంగిక నేరానికి పాల్పడిన నిందితుడిని నిర్ధోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించారు. నిందితుడి రిలీజ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టి వేశారు.
ప్రేమను శిక్షించడం కంటే, దోపిడీ, దుర్వినియోగాన్ని నిరోధించడంపై చట్టం దృష్టి పెట్టాలని తెలిపారు.ఏకాభిప్రాయంతో, గౌరవప్రదమైన కౌమార ప్రేమ మానవ అభివృద్ధిలో భాగమని కోర్టు తెలిపింది.ప్రేమ అనేది ఒక ప్రాథమిక మానవ అనుభవం అని, యుక్తవయస్సు వారికి భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ సంబంధాలు ఏకాభిప్రాయంతో కూడికుని ఉన్నట్టైతే చట్టం వాటిని గుర్తించి గౌరవించేలా చేయాలని వెల్లడించింది. యువత ప్రేమకు సంబంధించిన కేసుల్లో శిక్ష కంటే అవగాహనకు ప్రాధాన్యతనిస్తూ, వారి హక్కులను కాపాడాలని నొక్కి చెప్పింది.






