ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 15:45:08  IST  )

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radha Krishnan) విజయం సాధించిన తెలిసిందే.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radha Krishnan) విజయం సాధించిన తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చేతిలో ఓడిన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Roddy) సంచలన లేఖ (Letter) విడుదల చేశారు. ఆ లేఖలో ఉప రాష్ట్రపతి ఎన్నిక తీర్పును తాను సవినయంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో ఓటమిని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రయాణం తనకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు. న్యాయం, ప్రతీ వ్యక్తి యొక్క గౌరవం కోసం నిలబడే అవకాశం అందించిందని తెలిపారు. తనను కూటమి అభ్యర్ధిగా నిలబెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు అంటూ జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.

Next Story