- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
పరువు నష్టం కేసులో లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై జార్ఖండ్ (Jharkhand)లోని చైబాసా ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పరువు నష్టం కేసులో లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై జార్ఖండ్ (Jharkhand)లోని చైబాసా ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, జూన్ 26న స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించిగా.. రాహుల్ తరఫు న్యాయవాది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. కానీ, ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇవాళ రాహుల్‌గాంధీ చైబాసా ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరిచింది. కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాగా, 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ (Congress Plenary) సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా (Amit Shah)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఎవరైనా బీజేపీ అధ్యక్షుడు కావచ్చని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత ప్రతాప్ కటియార్ (Pratap Katiyar), రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీతో పాటు అమిత్ షా పరువుకు భంగం వాటిల్లేలా ఉన్నాయని చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. కానీ, పలుమార్లు ఆయన విచారణకు డుమ్మా కొట్టడంతో చైబాసా ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.






