- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. పెళ్లై కేవలం 45 రోజులే.. మామ నచ్చాడని భర్తను చంపించింది!
బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో వివాహ బంధానికి విలువ లేకుండాపోతుంది. పెళ్లికి ముందు ప్రేమించిన వాళ్ల కోసం పెళ్లి తర్వాత కాళ్ల పారాణి కూడా ఆరకముందే తమ భర్తలను హత్య చేస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారాయి. ఓ ఘటన మరవకముందే మరో ఘటన వెలుగులోకి వస్తోంది. మరీ ముఖ్యంగా మేఘాలయ హనీమూన్ మర్డర్ తర్వాత ఇలాంటి దారుణాలు అనేకం చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన బిహార్ (Bihar) రాష్ట్రంలోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. బర్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాంశుకు 45 రోజుల క్రితం గుంజా దేవితో వివాహమైంది. అయితే, గుంజా దేవికి పెళ్లి ముందు నుంచే తన మేనమామ అయిన జీవన్ సింగ్ (55)తో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరి పెళ్లికి వారి కుటుంబ సభ్యులు అంగీకరించకుండా గుంజా దేవిని ప్రియాంశుకి ఇచ్చి బలవంతంగా పెళ్లి జరిపించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఆమె జీవన్ సింగ్‌తో కలిసి ఉండాలంటే భర్త అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం ప్రియుడితో కలిసి కుట్ర పన్ని భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌ను కూడా నియమించుకుంది.
ఈ క్రమంలో జూన్ 25న ప్రియాంశు తన సోదరి ఇంటికి వెళ్లి రైలులో తిరిగి వస్తున్నాడు. నవీ నగర్ స్టేషన్‌లో దిగిన తర్వాత తనను ఇంటికి తీసుకెళ్లేందుకు ఎవరినైనా పంపమని భార్య గుంజా దేవికి ఫోన్ చేసి చెప్పాడు. ఇదే ఛాన్స్ అనుకున్న గుంజా దేవి సుపారీ గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చింది. ఇక స్టేషన్ నుంచి ఇంటికి బైక్‌పై వస్తున్న ప్రియాంశును ఇద్దరు వ్యక్తులు మార్గమధ్యంలో అడ్డగించి కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, భర్త చనిపోయిన తర్వాత గుంజా దేవి ప్రవర్తనపై ప్రియాంశు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె గ్రామం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారి అనుమానం మరింత బలపడింది. పోలీసులు గుంజా దేవి కాల్ రికార్డులను పరిశీలించగా, ఆమె తన మేనమామ జీవన్ సింగ్‌తో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత జీవన్ సింగ్ కాల్ డేటాను విశ్లేషించగా, అతను షూటర్లతో సంప్రదింపులు జరిపినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో గుంజా దేవితో పాటు ఇద్దరు షూటర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అమ్రిష్ రాహుల్ మీడియాకు తెలిపారు. పరారీలో ఉన్న జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.






