- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crocodile Attacks Elephant : నీటిలోని మొసలిపై ఏనుగు సంచలన విజయం!
స్థాన బలానికి నిదర్శనంగా మొసలి(Crocodile) బలాన్ని చెప్పుకోవడం ఆనవాయితీ. ఇందుకు పురాణాల్లో గజేంద్ర మోక్షం ఘట్టం కూడా ఓ చక్కని ఉదాహారణ. అయితే కాలమహిమ ఏమో గాని ఈ స్థాన బలం కథ తిరగబడింది. నీళ్ల(In The Water)లో ఉన్నాననే ధైర్యంతో ఓ మొసలి గజరాజుపై(Crocodile Attacks Elephant) పైనే దాడి చేసి గర్వభంగానికి గురైంది.

దిశ, వెబ్ డెస్క్: స్థాన బలానికి నిదర్శనంగా మొసలి(Crocodile) బలాన్ని చెప్పుకోవడం ఆనవాయితీ. ఇందుకు పురాణాల్లో గజేంద్ర మోక్షం ఘట్టం కూడా ఓ చక్కని ఉదాహారణ. అయితే కాలమహిమ ఏమో గాని ఈ స్థాన బలం కథ తిరగబడింది. నీళ్ల(In The Water)లో ఉన్నాననే ధైర్యంతో ఓ మొసలి గజరాజు(Crocodile Attacks Elephant) పైనే దాడి చేసి గర్వభంగానికి గురైంది. ఓ అడవిలో ఏనుగుల గుంపు నీళ్లు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వెళ్లాయి. లోపలికి దిగి నీళ్లు తాగుతున్న సమయంలో ఓ మొసలి ఆకస్మాత్తుగా ఓ ఏనుగుపై దాడి చేసి దాని తొండాన్ని పట్టుకుంది.
ఏనుగు వెంటనే ప్రాణ రక్షణ పోరాటంలో తగ్గేదేలే అన్నట్లుగా మొసలిని నీటీలోంచి పైకి లేపి, మళ్లీ నీటిలోకి విసిరి దానిపై కాలు పెట్టి తొక్కేసింది. దీంతో ఆ ముసలి ఏనుగు తొండంను వదిలేయగా..ఏనుగు సురక్షితంగా ఓడ్డుకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మొసలికి ఏనుగు భలే కౌంటర్ ఎటాక్ ఇచ్చిందని కొందరు.. స్థానబలం ప్రతిసారి పనిచేయదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
సహజంగా నీళ్లలో మొసళ్లకు పదేనుగుల బలం ఉంటుందని చెప్తుంటారు. అందుకే మొసలి నీళ్లలో ఉంటే.. సింహాం, పులులు, ఏనుగులు వంటి బలమైన జంతువులు సైతం వాటికి జోలికి పోయేందుకు సాహాసం చేయవు. అయితే తాగు నీళ్ల కోసం, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో సరస్సులు, నదులలోకి వచ్చిన జంతువులపై మొసళ్లు దాడులు చేస్తుంటాయి. అలా నీటీ కోసం వచ్చిన ఏనుగుల గుంపులోని ఓ ఏనుగుపై మొసలి దాడి చేయడం..ఆ పోరాటంలో ఏనుగు విజయం సాధించడం సంచలనంగా మారింది.






