బ్రాడ్ కాస్టింగ్ బిల్లుపై.. విమర్శల వెల్లువ! దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం

by Geesa Chandu |   (  Updated:2024-08-13 09:16:06  IST  )

ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన కొత్త బ్రాడ్ కాస్టింగ్ బిల్లు ముసాయిదాను వెనక్కు తీసుకుంది.

బ్రాడ్ కాస్టింగ్ బిల్లుపై.. విమర్శల వెల్లువ! దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన కొత్త బ్రాడ్ కాస్టింగ్ బిల్లు ముసాయిదాను వెనక్కు తీసుకుంది. అయితే ఈ బిల్లు ద్వారా ఆన్లైన్ కంటెంట్ పై నియంతృత్వ ధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందని సర్వత్రా విమర్శలు రావటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ కొత్త బిల్లు ద్వారా వాక్ స్వాతంత్య్రానికి తీవ్ర ముప్పు వాటిల్లిందని అంటున్నారు కంటెంట్ క్రియేటర్స్. దీంతో పాటు ఈ బిల్లుపై విపక్షాల నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో.. కేంద్రం వెనక్కి తగ్గింది. తర్వాత ఈ బిల్లులోని పలు నిబంధనలను పూర్తిగా సమీక్షించుకొని, సవరణ చేసి మళ్ళీ పార్లమెంట్ ముందుకు తీసుకువస్తామని వెల్లడించింది. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్స్ పోషించిన కీలక పాత్రను దృష్టిలో పెట్టుకొని, వారి గొంతును నొక్కేలా ఈ ముసాయిదా బిల్లు రూపొందించారని విమర్శలు వెల్లువెత్తాయి. అందువల్ల ఈ సారి డిజిటల్ మీడియా సంస్థలతో పాటు బ్రాడ్ కాస్టింగ్ సేవలతో ముడిపడ్డ అన్ని వర్గాలతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story