మహా ఘోరం.. పాపను నీటిలో మరిగించి చంపిన తల్లి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-09 06:10:24  IST  )

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నెలమంగళలో తల్లి నవజాత శిశువును నీటిలో మరిగించి హత్య చేసింది. పాప సరిగ్గా పాలు తాగడం లేదని.. పదే పదే ఏడుస్తుందని.. ఇలా

మహా ఘోరం.. పాపను నీటిలో మరిగించి చంపిన తల్లి..
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నెలమంగళలో తల్లి నవజాత శిశువును నీటిలో మరిగించి హత్య చేసింది. పాప సరిగ్గా పాలు తాగడం లేదని.. పదే పదే ఏడుస్తుందని.. ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రసవానంతరం వల్ల వచ్చే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కారణంగా ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 27ఏళ్ల రాధను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సెక్షన్ 103 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అయితే శిశువును బతికుండగానే బాయిల్ చేసి చంపొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పని చేసిన తల్లికి తగిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story