Plane Crash : పుణెలో కూలిన శిక్షణ విమానం

by Prasad Jukanti |

శిక్షణ విమానం కూలిపోవడం కలకలం రేపింది.

Plane Crash : పుణెలో కూలిన శిక్షణ విమానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో శిక్షణ విమానం (Training Plane Crash) కూలిపోయింది. పుణె (Pune) జిల్లా బారామతి సమీపంలోని కట్ఫాల్ గ్రామం వద్ద రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఒక శిక్షణ విమానం ప్రమాదం బారిన పడింది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో పైలట్ శక్తి సింగ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు అడ్డురావడంతో పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేసినట్లు తెలిసింది. తిరిగి రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిండంతో ఈ సమయంలో విమానం ముందు చక్రం ఊడిపోయింది. దీంతో రన్ వే నుంచి విమానం పక్కన ఉన్న పొదల్లోకి తూసుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై పోలీసులు, స్థానిక అధికారులు, డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించారు.

Next Story