అక్కడ నమాజ్ చేయడం తప్పే.. హైకోర్టు షాకింగ్ తీర్పు

by Ajay Maddhiboyina |

ప్ర‌భుత్వ భూమిలో న‌మాజ్ చేయ‌డంపై ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రజాస్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హక్క ప్రజా భత్రతతో పాటు మరికొన్ని హక్కులకు లోబడి ఉంటుందని పేర్కొంటూ.. నమాజ్ చేసేందుకు లేదా భారీ మతపరమైన సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వ భూమిని తమ హక్కుగా భావించవద్దని స్పష్టం చేసింది.

అక్కడ నమాజ్ చేయడం తప్పే.. హైకోర్టు షాకింగ్ తీర్పు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌భుత్వ భూమిలో న‌మాజ్ చేయ‌డంపై ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రజాస్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హక్క ప్రజా భత్రతతో పాటు మరికొన్ని హక్కులకు లోబడి ఉంటుందని పేర్కొంటూ.. నమాజ్ చేసేందుకు లేదా భారీ మతపరమైన సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వ భూమిని తమ హక్కుగా భావించవద్దని స్పష్టం చేసింది. యూపీలోని సంభాల్ జిల్లాలోని ఇనోకా గ్రామంలోని ఓ స్థలంలో నమాజ్ చేయ‌డానికి అనుమ‌తి కోరుతూ ఓ వ్య‌క్తి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. దానిపై విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ గ‌రిమా ప్ర‌సాద్, జ‌స్టిస్ స‌ర‌ళ్ శ్రీవాస్త‌వ‌ల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ పిటిష‌న్ ను కొట్టివేసింది.

పిటిష‌న‌ర్ వాద‌న ప్ర‌కారం.. జూన్ 16, 2023న రిజిస్ట‌ర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా భూమి త‌న సొంతం అయిన‌ప్ప‌టికీ తాము న‌మాజ్ చేయ‌కుండా చ‌ట్ట‌విరుద్దంగా అడ్డుకుంటున్నార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్తిలో న‌మాజ్ చేసుకునేందుకు ముందస్తు అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని పేర్కొంటూ ప్రార్థ‌న‌ల‌పై ఆంక్ష‌లు రాజ్యాంగ హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాధించారు. అయితే ఆ భూమి రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం ప్ర‌జా వినియోగం కోసం ఉద్దేశించిన అబాదీ భూమి అంటే నివాస‌యోగ్య‌మైన భూమిగా ఉన్నందున పిటిష‌న‌ర్ చ‌ట్ట‌ప‌ర‌మైన యాజ‌మాన్యాన్ని నిరూపించ‌డంలో విఫ‌లం అయ్యార‌ని కోర్టు వ్య‌తిరేకించింది.

పిటిష‌న‌ర్ స‌మ‌ర్పించిన గిఫ్ట్ డీడ్ ప‌త్రంలో భూమిని గుర్తించే ముఖ్య‌మైన గుర్తులు కూడా లేవ‌ని, కేవ‌లం అస్ప‌ష్ట‌మైన స‌రిహ‌ద్దులు మాత్ర‌మే ఉన్నాయ‌ని పేర్కొంది. ఆ ప్ర‌దేశంలో ఈద్ పండుగ స‌మ‌యంలో న‌మాజ్ కు అవ‌కాశం ఇస్తున్నామ‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. కానీ త‌ర‌చూ నిర్వ‌హించ‌డంతో పాటు గ్రామం బ‌య‌ట నుండి కూడా ప్ర‌జ‌ల‌ను ఆహ్వానించ‌డం వ‌ల్ల సామాజిక స‌మ‌తుల్య‌త‌కు భంగం క‌లిగించిన‌ట్టు అవుతుంద‌ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రాజ్యాంగం మ‌త స్వేచ్ఛ‌కు హామీ ఇస్తున్న‌ప్ప‌టికి అది ప్ర‌జాభ‌ద్ర‌త‌, నైతిక‌త మ‌రియు స‌మాజ ఆరోగ్యం ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని కోర్టు పేర్కొంది. ప్ర‌భుత్వ భూమి ఉమ్మ‌డి వినియోగం కోసం ఉద్దేశించ‌బ‌డింద‌ని.. రాక‌పోక‌లు లేదా పౌర శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించే మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలకు వినియోగించుకోరాద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

Next Story