- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'డేరా బాబా'కు.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఇద్దరు మహిళలపై రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా స్వచ్చా సౌదా చీఫ్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి బయటకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు మహిళలపై రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా స్వచ్చా సౌదా చీఫ్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి బయటకొచ్చారు. డేరా బాబాకు 21 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు కావడంతో.. హర్యానాలోని సునారియా జైలు నుంచి మంగళవారం ఉదయం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బెయిల్ పీరియడ్ లో ఆయన ఉత్తరప్రదేశ్ లోని బర్నవాలో ఉన్న డేరా ఆశ్రమంలో బస చేస్తారని అతని అనుచరులు మీడియాకు తెలిపారు. కాగా డేరా బాబా తన ఆశ్రమంలో ఉండే మహిళా శిష్యులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు 16 ఏళ్ల కిందట ఓ జర్నలిస్ట్ హత్య కేసులోనూ డేరా బాబాతో పాటు మరో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. తర్వాత వివిధ కారణాలతో గడిచిన రెండేళ్లలో, 7 సార్లు పెరోల్ మీద బయటకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నాలుగేళ్లలో మొత్తం 9 సార్లు డేరా బాబా బయటకి వచ్చారు.






