తహవ్వుర్ రాణాకు మూడు ఫోన్ కాల్స్ పర్మిషన్

by Phanindra |

తహవ్వుర్ రాణాకు మూడు ఫోన్ కాల్స్ చేసుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కుటుంబంతో మాట్లాడాలన్న అతని అభ్యర్థనను మన్నించింది.

తహవ్వుర్ రాణాకు మూడు ఫోన్ కాల్స్ పర్మిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: 26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన తహవ్వూర్ రాణాకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. కుటుంబానికి మూడు ఫోన్ కాల్స్ చేసుకునేందుకు రాణాకు కోర్టు అనుమతినిచ్చింది. ప్రైవేట్ లాయర్‌ను పెట్టుకోవడానికి తన సోదరుడితో మాట్లాడాలని రాణా కోరగా.. కోర్టు అంగీకరించింది. అదే సమయంలో అతని జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 8 వరకు పెంచుతున్నట్లు స్పెషల్ జడ్జ్ చందర్‌జీత్ సింగ్ పేర్కొన్నారు. అయితే రాణా చేసే ఫోన్ కాల్స్ రికార్డు చేయాలని, అలాగే కేవలం ఇంగ్లిష్ లేదా హిందీలో మాత్రమే అతను మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలో అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పియూష్ సచ్‌దేవ కోరారు.

Next Story