బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్ డౌన్.. రేపు నితీశ్ రాజీనామా

by Naga Rani Yarlagadda |

బిహార్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200కు పైగా నియోజకవర్గాల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది.

బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్ డౌన్.. రేపు నితీశ్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200కు పైగా నియోజకవర్గాల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ క్రమంలో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కౌంట్ డౌన్ షురూ అయింది. మూడ్రోజుల్లో బిహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 19 లేదా 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా.. మరోసారి బిహార్ సీఎంగా నితీష్ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా ఇప్పటికే 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. త్వరలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలోనే ఒక రాష్ట్రానికి అత్యధిక సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా.. నితీశ్ కొత్తరికార్డుకెక్కనున్నారు.

ఈ క్రమంలో రేపు నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను గవర్నర్ కు పంపనున్నారు. రేపు కేబినెట్ భేటీ అనంతరం 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత నితీశ్ రాజీనామా చేయనున్నారు. అలాగే రేపు NDA భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్షాలు సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు NDA నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు బిహార్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు NDA పక్షాలు గవర్నర్ అనుమతిని కోరనున్నాయి.

Next Story