Coromandel Express: కోరమండల్ రైలు ప్రమాదంలో 12 మంది ఏపీ ప్రయాణికుల ఆచూకీ తెలియాల్సి ఉంది

by Disha Web Desk 10 |
Coromandel Express: కోరమండల్ రైలు ప్రమాదంలో 12 మంది ఏపీ ప్రయాణికుల ఆచూకీ తెలియాల్సి ఉంది
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కోరమండల్ రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 12 మంది సమాచారం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఈ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో తెలుగు ప్రయాణీకులు అత్యధికంగా ప్రయాణం చేస్తుంటారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఒడిశా బాలాసోర్‌లో ఆదివారం మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కోరమండల్ రైలులో 342 మంది తెలుగు ప్రయాణీకులున్నారని అయితే వీరిలో 331 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు మంత్రి అమర్ నాథ్ తెలిపారు. వీరిలో 11 మంది గాయపడ్డారని వారికి పలు ఆస్పత్రులలో చికిత్స అందుతున్నట్లు మంత్రి ప్రకటించారు. అయితే మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృతి చెందాడన్నారు. ఒడిశాలో స్థిరపడిన గురుమూర్ ఏపీలో పెన్షన్ తీసుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై మరణించాడని.. ఆయన మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.

Next Story

Most Viewed