కాంగ్రెస్, ఎస్పీలు పాకిస్థాన్ సానుభూతి పరులు: యూపీ ర్యాలీలో ప్రధాని మోడీ

by samatah |
కాంగ్రెస్, ఎస్పీలు పాకిస్థాన్ సానుభూతి పరులు: యూపీ ర్యాలీలో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు పాకిస్థాన్‌ సానుభూతిపరులు అని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అణుశక్తి పేరుతో దేశాన్ని భయపెడుతున్నాయని మండిపడ్డారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై కన్నేసిన పాకిస్థాన్ ప్రస్తుతం పతనం అంచున ఉంది, కానీ దాని సానుభూతి పరులైన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని భయపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి అని అన్నారు. ‘పాక్ వద్ద అణుబాంబు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వారు చెబుతున్నారు. కానీ 56 అంగుళాలు అంటే ఏమిటో వారికి తెలియదు. ఇది బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. బలమైన మోడీ ప్రభుత్వం’ అని తెలిపారు. భారత్‌ను బెదిరించేందుకు ప్రయత్నించే వారిని విడిచిపెట్టబోమని, అలాంటి వారిని వారి ఇళ్లలోనే మట్టుబెడుతుందని వెల్లడించారు. మోడీ బతికి ఉన్నంత కాలం దళితులు, వెనుకబడిన ప్రజలు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ తీసివేయలేరని స్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ కోరుకుంటుందని చెప్పారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్, ఎస్పీలను ఉత్తరప్రదేశ్ ప్రజలు నిద్రలేపుతారని, కానీ ఆ టైంలో వారు ఈవీఎంలను నిందిస్తారని తెలిపారు.

Read More..

మమతా బెనర్జీ జాతీయ భద్రతతో రాజీ పడుతున్నారు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Next Story