చైనా దురాక్రమణలకు అంగీకారమా? మోడీ-జిన్‌పింగ్ భేటీపై కాంగ్రెస్ ఫైర్

by Phanindra |

మోడీ-జిన్‌పింగ్ భేటీపై కాంగ్రెస్ ఫైర్ అయింది. చైనా దురాక్రమణలకు పరోక్షంగా అంగీకారం తెలిపినట్లేనా? అని నిలదీసింది.

చైనా దురాక్రమణలకు అంగీకారమా? మోడీ-జిన్‌పింగ్ భేటీపై కాంగ్రెస్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోడీ కలవడంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. చైనా బెదిరింపులు, కేంద్ర ప్రభుత్వ పిరికితనంతో ఏది సాధారణమో నిర్ణయిస్తారా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. చైనాతో మోడీ కలవాలనుకోవడం ఆ దేశం సరిహద్దుల్లో చేస్తున్న దురాక్రమణలను ఆమోదించినట్లేనా? అని నిలదీసింది. ‘2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది వీరులైన జవాన్లు ప్రాణాలు వదిలారు.

ఇప్పుడు ప్రధాని మోడీ, జీ జిన్‌పింగ్ సమావేశం సమయంలో ఆ విషయం మర్చిపోకూడదు. అలాంటి పనులు చేస్తున్న చైనా దురాక్రమణలను గుర్తించకుండా.. ప్రధాని మోడీ మాత్రం ఆ దేశానికి క్లీన్ చిట్ ఇచ్చారు’ అని జైరాం రమేశ్ విమర్శించారు. లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులను పూర్తిగా పునరుద్ధరించాలన్న ఆర్మీ చీఫ్ డిమాండ్‌ను కూడా మోడీ ప్రభుత్వం పూర్తిచేయలేదన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా చైనాతో కలవాలని అనుకోవడం కచ్చితంగా డ్రాగన్ దేశం దురాక్రమణలను ఆమోదించినట్లేనని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా మద్దతిచ్చిందన్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. దాని గురించి కూడా ఏమీ మాట్లాడని మోడీ ఇప్పుడు చైనాకు అధికారిక పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.

Next Story