ఫోటో సెషన్లు ఫలితం ఇవ్వలేదు.. ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ సైటైర్లు

by Prasad Jukanti |

ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఫోటో సెషన్లు ఫలితం ఇవ్వలేదు.. ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ సైటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‍పై (India US Trade Deal) అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. భారత్, అమెరికాలకు ఇది మంచి శుభవార్త అని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ట్రేడ్ డీల్ ఉందని బీజేపీ చెబుతుంటే దేశ ప్రయోజనాలను అమెరికాకు మోడీ అమ్మేశారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ డీల్‍పై కాంగ్రెస్ (Congress) వ్యంగ్యాస్త్రాలు సంధించింది. హౌడీ మోడీ కంటే నమస్తే ట్రంప్ దే‍పై చేయి ఉందని తాజాగా ట్రేడ్ డీల్‍పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. స్నేహితుడు ఎన్నటికీ స్నేహితుడిగానే కొనసాగబోడంటూ సైటైర్లు వేసింది. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ ఇటీవల విడుదలైన అమెరికా–భారత్ సంయుక్త ప్రకటనలో స్పష్టమైన వివరాలు లేకపోయినా, బయటకు వచ్చిన సమాచారం ఆధారంగా కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయని భారత్ ఇకపై రష్యా నుంచి చమురు దిగుమతి చేయదు. అదనంగా, భారత్ నేరుగా లేదా పరోక్షంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 25 శాతం పెనాల్టీ టారిఫ్స్ మళ్లీ విధించవచ్చని అమెరికా ప్రకటించిందని ఆరోపించారు.

ఫోటో సెషన్లు పెద్దగా ఫలితం ఇవ్వలేదు:

అమెరికా రైతులకు మేలు చేసేలా భారత్ దిగుమతి సుంకాలను తగ్గించనుందని ఇది భారతీయ రైతుల ప్రయోజనాలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్నారు. అమెరికా నుంచి భారత్ వార్షిక దిగుమతులు మూడు రెట్లు పెరగనున్నాయని దీని వల్ల ఇప్పటివరకు కొనసాగుతున్న సరుకుల వాణిజ్య మిగులు (ట్రేడ్ సర్‌ప్లస్) పూర్తిగా తగ్గిపోవచ్చని పేర్కొన్నారు. ఐటీ మరియు ఇతర సేవల ఎగుమతుల విషయంలో భారత్‌కు అమెరికాతో అనిశ్చితి కొనసాగనుందని అమెరికాకు భారత్ నుంచి సరుకుల ఎగుమతులపై గతంతో పోలిస్తే ఎక్కువ సుంకాలు విధించే అవకాశముందన్నారు. అన్ని ఆలింగనాలు, ఫోటో సెషన్లు పెద్దగా ఫలితం ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. “నమస్తే ట్రంప్” కంటే “హౌడీ మోదీ” పైచేయి సాధించినట్లుగా పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

Next Story