- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్‌లో కుక్కపిల్ల వివాదం.. "కరిచే అసలైన వాళ్లు అక్కడే కూర్చున్నారన్న రేణుకా చౌదరి
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ ఆవరణలోకి కుక్కపిల్లను తీసుకురావడంతో తీవ్ర వివాదం తలెత్తింది.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ ఆవరణలోకి కుక్కపిల్లను తీసుకురావడంతో తీవ్ర వివాదం తలెత్తింది. దీనిని ఆమె చిన్నవిషయంగా కొట్టిపారేశారు. పార్లమెంట్‌లోకి కుక్కలను తీసుకురావొద్దని.. "దీనికి ఏదైనా చట్టం ఉందా? అని ఆమె ప్రశ్నించారు. అలాగే.. తాను వెళ్తున్నప్పుడు రోడ్డుపై జరిగిన ఒక చిన్న ప్రమాదం కారణంగా ఈ కుక్కపిల్ల రోడ్డుపై తిరుగుతోంది. దానికి ఏదైనా తగులుతుందేమోనని, దాన్ని ఎత్తుకుని కారులో పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చి, వెంటనే దాన్ని వెనక్కి పంపించేశాను," అని ఆమె వివరించారు. ఈ చిన్న సంఘటనపై చర్చించడం యొక్క ఉద్దేశం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రేణుకా చౌదరి అధికార పక్షంపై పరోక్ష విమర్శలు చేశారు. "మూగ జీవిని మేము రక్షించాం. అది పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వేరే పని లేదా?" అని ఆమె నిలదీశారు. అంతేకాకుండా, "అసలైన కరిచే వాళ్లు పార్లమెంట్‌లోనే కూర్చున్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రతిరోజూ పార్లమెంట్‌లో కూర్చుని మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మనం మాట్లాడం," అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారని, ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఈ సందర్భంగా ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు.






