నాకు రాహుల్ గాంధీ అంటే నచ్చదు: కాంగ్రెస్ నేత

by Gantepaka Srikanth |

కేరళకు చెందిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.

నాకు రాహుల్ గాంధీ అంటే నచ్చదు: కాంగ్రెస్ నేత
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళకు చెందిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్(Mani Shankar Aiyar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో కేరళలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటమి ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, పవన్ ఖేరా ముగ్గురూ పనికిమాలిన నేతలు అని అన్నారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ ఒక వీధి రౌడీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను వందశాతం గాంధేయవాదిని.. నేహ్రూ, రాజీవ్‌కు శిష్యుడిని కానీ.. రాహుల్‌కు శిష్యుడిని కాదు.. రాహుల్ అంటే నచ్చదు అని కూడా అన్నారు. ఈ సందర్భంగా కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ‘ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడం నేను చూడాలనుకుంటున్నాను. కానీ ఒక గాంధేయవాదిగా నేను నిజం మాత్రమే చెప్పగలను. కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం చాలా బాగుంది. రాష్ట్రం ఊహించిన విధంగా అభివృద్ధి చెందుతోంది’ అని మణిశంకర్ అయ్యర్ చెప్పుకొచ్చారు.

Next Story