- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. దేశ ప్రజలకు విజ్ఞప్తి
పహల్గాం ఉగ్రదాడి(Terror Attack)పై కాంగ్రెస్(Congress) నేత కేసీ వేణుగోపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ(AICC) ఆఫీస్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి(Terror Attack)పై కాంగ్రెస్(Congress) నేత కేసీ వేణుగోపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ(AICC) ఆఫీస్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్(KC Venugopal) మీడియాతో మాట్లాడారు. పహల్గాం ప్రాంతంలో మూడెంచల భద్రత ఉంటుంది.. ఆ ప్రాంతం మొత్తం హోంశాఖ పరిధిలో ఉంటుందని అన్నారు. గుఢాచార వైఫల్యం, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ జరుగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏప్రిల్25న దేశవ్యాప్తంగా కొవ్వుత్తులతో ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా పేర్కొంది. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఉగ్రదాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఐక్యంగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో విభజనను ప్రోత్సహించేలా బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శలు చేసింది.






