- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్టీకి, మాకు ఉన్న తేడా ఇదే.. KC వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్(Congress) పార్టీ కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) పార్టీ కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెంగళూరులో ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. దేశ రక్షణ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయబోం, రాజీ పడబోం అన్నారు. జాతి అవసరాలు మాత్రమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చరిత్ర ఇదే విషయాన్ని చెబుతోందని అన్నారు. దేశం కోసం మేము పోరాడుతాం, ఎవరితో అయినా ఫైట్ చేస్తామని ప్రకటించారు. ముందు దేశం.. ఆ తర్వాతే రాజకీయాలు చేస్తామని అన్నారు. పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత తాను, రాహుల్ గాంధీ ఇద్దరం శ్రీనగర్‌లో బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లాం. బాధితులను పరామర్శించామని తెలిపారు. కానీ.. కేంద్రం అలా కాదు.. ఉగ్రదాడులను కూడా రాజకీయాలకు వాడుకుంటనేందుకు ప్రయత్నం చేసింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. అందుకే ఆ పార్టీకి, తమకు చాలా తేడా ఉందని అన్నారు.






