హిండెన్ బర్గ్ నివేదికపై .. కాంగ్రెస్ వివాదాన్ని వ్యాప్తి చేస్తోంది! జ్యోతిరాదిత్య సింధియా

by Geesa Chandu |

సరిగ్గా ఏడాదిన్నర కిందట ప్రముఖ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ సంస్థ పై సంచలన ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్ బర్గ్.. తాజాగా సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయన్న సంగతి తెలిసిందే.

హిండెన్ బర్గ్ నివేదికపై .. కాంగ్రెస్ వివాదాన్ని వ్యాప్తి చేస్తోంది! జ్యోతిరాదిత్య సింధియా
X

దిశ, వెబ్ డెస్క్: సరిగ్గా ఏడాదిన్నర కిందట ప్రముఖ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్ బర్గ్.. తాజాగా సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయన్న సంగతి తెలిసిందే. అయితే సెబీ ఛైర్ పర్సన్ మాధవీ పూరిపై.. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ వివాదాన్ని వ్యాప్తి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఆరోపించారు. అదానీ గ్రూప్ అక్రమంగా నిధుల మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో.. సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ తో పాటు ఆమె భర్తకు కూడా వాటాలున్నాయని తాజా నివేదికలో తెలపటంతో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే హిండెన్ బర్గ్ నివేదికపై బీజేపీ నేత సింధియా భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, అరాచకాలకు తెరతీస్తుందని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ.. దేశంలో సులభంగా వివాదాలు వ్యాప్తి చేసి, ఆ వివాదాల్లో దేశం నలిగిపోవాలని కోరుకుంటోందని సింధియా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Next Story