- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌లో కాంగ్రెస్ ఒంటరి పోరు.. మొత్తం 294 స్థానాల్లో పోటీ
by Phanindra |
బెంగాల్‌లో కాంగ్రెస్ ఒంటరి పోరుకు వెళ్తోంది. మొత్తం 294 స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ డిసైడ్ అయింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, బెంగాల్ ఇన్‌చార్జ్ గులాం అహ్మద్ మీర్, పార్టీ స్టేట్ చీఫ్ సుభాంకర్ సర్కార్, సీనియర్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, ఇషా ఖాన్ చౌదరి తదితరులు హాజరయ్యారు. అనంతరం తమ పార్టీ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలో దిగుతుందని ప్రకటించారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలను తాము చర్చించామని, ఒంటరిగానే బరిలో దిగుతున్నామని గులాం అహ్మద్ మీర్ తెలిపారు. గతంలో వేరే పార్టీలతో జతకట్టడం కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహపరిచిందని ఆయన అన్నారు.
Next Story






