- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదిలే రైలులో కలకలం.. టాయిలెట్ నుంచి ఎగసిపడిన నిప్పురవ్వలు.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో రైల్వే ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో రైల్వే ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కదులుతున్న రైలులో సడెన్‌గా బ్రేకులు వేయడంతో.. టాయిలెట్ నుంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా రైలు ప్రయాణంలో బ్రేకులు వేసినప్పుడు చక్రాల వద్ద రాపిడి జరగడం సహజం. కానీ, ఈ వీడియోలో బ్రేక్ వేసినప్పుడు నేరుగా టాయిలెట్ లోపల మంటలు, నిప్పురవ్వలు చెలరేగడం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో రైళ్లలో భద్రతా ప్రమాణాలు, అత్యవసర వ్యవస్థలు, కోచ్‌ల నిర్వహణ లోపాలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇండియా? పాకిస్తాన్? బంగ్లాదేశ్ దా?
అయితే, ఈ వీడియో ఎక్కడ జరిగింది, ఏ దేశానికి చెందిన రైలు అన్న దానిపై స్పష్టత లేదు. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నెటిజన్లు ఇది ఇండియా, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ రైలు అయి ఉంటుందని భావిస్తూ.. తమ తమ దేశాల రైల్వే వ్యవస్థల దుస్థితిని ఎత్తిచూపుతూ ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రైల్వే భద్రత, నిర్వహణపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఈ ఘటన వెనుక ఉన్న అసలు వాస్తవాలను వెల్లడించాలని నెటిజన్లు కోరుతున్నారు.






