సీఎం టాటూ వేయించుకున్న మహిళ.. రాజకీయంగా దుమారం

by Sujitha Rachapalli |

సినిమా స్టార్లకే కాదు రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉంటారు. వారిపై ప్రేమను వినూత్నంగా వ్యక్తపరుస్తారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ముఖాన్ని టాటూగా వేయించుకుంది. లక్నో వాసి అయిన హిమాన్షి తన చేతిపై యోగి ఫొటోను టాటూగా వేయించుకోవడమే కాదు

సీఎం టాటూ వేయించుకున్న మహిళ.. రాజకీయంగా దుమారం
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా స్టార్లకే కాదు రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉంటారు. వారిపై ప్రేమను వినూత్నంగా వ్యక్తపరుస్తారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ముఖాన్ని టాటూగా వేయించుకుంది. లక్నో వాసి అయిన హిమాన్షి తన చేతిపై యోగి ఫొటోను టాటూగా వేయించుకోవడమే కాదు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా రాయించుకుంది. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొందరు సీఎం పట్ల మహిళ చూపిన గౌరవానికి ప్రతీకగా పరిగణిస్తే.. మరికొందరు మాత్రం గౌరవనీయ ప్రధానమంత్రి అని రాసుకోవడాన్ని తప్పుపట్టారు. ఇంకొందరు ఆమె యోగీని ప్రైమ్ మినిస్టర్‌గా భావించడాన్ని సమర్ధించారు. మోడీ తర్వాత పీఎం అయ్యే హోదా యోగికి ఉందని.. ఇందులో విమర్శించాల్సిన అవసరం ఏముందని మహిళను సపోర్ట్ చేస్తున్నారు. కాగా ఇంతకు ముందు కూడా యోగీ ఆదిత్యనాథ్ పరిపాలనకు ఫిదా అయిన ఓ ముస్లిం యువకుడు తన టాటూ వేయించుకోవడం విశేషం.

Next Story