ఆర్సీబీ ప్రతినిధులను అరెస్ట్ చేయండి.. సీఎం సిద్దరామయ్య సీరియస్

by Ajay Maddhiboyina |

బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు.

ఆర్సీబీ ప్రతినిధులను అరెస్ట్ చేయండి.. సీఎం సిద్దరామయ్య సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. ఆర్సీబీ, డీఎన్ఏ మేనేజ్‌మెంట్ మరియు కేఎస్‌సీఏ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే ఆర్సీబీ యాజమాన్యం సైతం కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది.

ఇందులో ఏ1గా ఆర్సీబీ, ఏ2గా డీఎన్ఏ మేనేజ్మెంట్, ఏ3గా కేఎస్‌సీఏను చేర్చారు. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది మరణించారు. మరణించినవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టేడియం ముందు ప్రాణాలు పోయినా ప్రభుత్వం సంబురాలు ఆపలేదని మండిపడుతున్నాయి.

Next Story