పడవ ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

by Naga Rani Yarlagadda |

కర్ణాటక పడవ ప్రమాద మృతుల కుటుంబాలకు సీఎం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

పడవ ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
X

దిశ, వెబ్‌‌డెస్క్: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో శిరాలి ప్రాంతంలోని పడుశిరాలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 14 మంది వెంకటాపుర నదిలో ఆల్చిప్పల్ని సేకరించేందుకు పడవలో వెళ్లారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా నది నీటిప్రవాహం పెరగడంతో పడవ నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం సిద్ధరామయ్య ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు. మరోవైపు నదిలో మరికొందరు కొట్టుకుపోగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో మరణించినవారిని లక్ష్మీ మహాదేవ నాయక్ (38), లక్ష్మీ శివరామ్ నాయక్ (39), ఉమేష్ మంజునాథ్ నాయక్ (42), మస్తమ్మ మంజునాథ్ నాయక్ (43), లక్ష్మీ అన్నప్ప నాయక్ (44), జ్యోతి నాగప్ప నాయక్ (37), మాలతి జట్టప్ప నాయక్ (38)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story